ఐపీఎల్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే కీలక పోరుకు ముందు ముంబై ఇండియన్స్ శిబిరం ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ మాట్లాడుతూ స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో బాధపడుతున్నాడని, దానిని ఒప్పుకోడానికి నిరాకరిస్తున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో పాండ్యా బౌలింగ్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ డౌల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో MI కోసం బౌలింగ్ ప్రారంభించి, కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్న హార్దిక్ పాండ్యా.. తర్వాతి మ్యాచ్ లలో బౌలింగ్ చేయడానికి ముందుకు రాలేదు.
మొదటి మ్యాచ్ బౌలింగ్ చేసి.. తాను ఫిట్ గా ఉన్నాననే స్టేట్మెంట్ ను హార్దిక్ పాండ్యా ఇచ్చాడని.. అయితే ఆ తర్వాతి మ్యాచ్ లలో బౌలింగ్ చేయలేదని సైమన్ అన్నారు. హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.. అతనిలో ఏదో లోపం ఉందని నేను మీకు చెప్తున్నాను, కానీ హార్దిక్ దానిని ఒప్పుకోవడం లేదన్నారు సైమన్.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయకూడదని పాండ్యా తీసుకున్న నిర్ణయం పలు అనుమానాలకు తావు ఇచ్చింది. అయితే సరైన సమయంలో బౌలింగ్ చేస్తానని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. “సరైన సమయంలో బౌలింగ్ చేయడం వల్ల మంచి జరుగుతుంది.” అని హార్దిక్ మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పాడు.