ఆ రిపోర్ట‌ర్‌కు, గిల్‌కు మ‌ధ్య గొడ‌వేంటి.?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

By Medi Samrat
Published on : 9 July 2025 2:55 PM IST

ఆ రిపోర్ట‌ర్‌కు, గిల్‌కు మ‌ధ్య గొడ‌వేంటి.?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో టెస్టులో టీమిండియా పునరాగమనం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ 336 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో ఓ ఇంగ్లీష్ రిపోర్టర్‌ను ట్రోల్‌ చేశాడు. ఆ రిపోర్టర్ ఇప్పుడు గిల్ చర్యపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మొదటిసారిగా ఒక ప్రకటన ఇచ్చాడు.

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం నుండి ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టు రికార్డుపై ప్రశ్నలు లేవనెత్తిన ఇంగ్లీష్ రిపోర్టర్ గురించి శుభ్‌మన్ గిల్ విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు.

నాకు ఇష్టమైన జర్నలిస్టు క‌న‌ప‌డ‌టం లేదు.. ఎక్కడ ఉన్నాడు.. నేను అత‌డిని చూడాలనుకుంటున్నాను.. చరిత్ర, గణాంకాలపై నాకు నమ్మకం లేదని టెస్టు మ్యాచ్‌కి ముందు కూడా చెప్పాను. 58 ఏళ్లలో మేము ఇక్కడ 9 మ్యాచ్‌లు ఆడాము, వివిధ జట్లు ఇక్కడకు వచ్చాయి. ఇంగ్లండ్‌కు వచ్చిన అత్యుత్తమ జట్టు ఇదేనని నా అభిప్రాయం. వారిని ఓడించే సత్తా మా వద్ద ఉంది.. ఇక్కడి నుంచి ఈ సిరీస్‌ను గెలుచుకునే సత్తా మా వద్ద ఉంది. మేము సరైన నిర్ణయాలు తీసుకుంటూ, గట్టిగా పోరాడుతూ ఉంటే, ఈ సిరీస్ నిజంగా చిరస్మరణీయంగా ఉంటుందన్నాడు.

గిల్‌ను ప్ర‌శ్నించింది జో విల్సన్ అనే BBC జర్నలిస్ట్. ఈ విష‌య‌మై విల్స‌న్‌ మాట్లాడుతూ.. గిల్ ఒక పెద్దమనిషి అని పేర్కొన్నారు. అతను గిల్ సమాధాన శైలిని కూడా ప్రశంసించాడు. RevSportzతో మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్టుకు ముందు మీ ప్రశ్నలు మార్చుకోబోతున్నారా అని విల్సన్‌ను అడగ‌గా.. అతన్ని ప్రేరేపించే ఏదీ నేను అడ‌గ‌ను అని బదులిచ్చాడు. గిల్‌ నిజమైన పెద్దమనిషి అని నేను అనుకుంటున్నాను. అతడు ప్రతి ప్రశ్నకు గౌరవంగా, తెలివిగా సమాధానం ఇస్తాడు. అతను తన బృందాన్ని అన్ని రంగాలలో, ముఖ్యంగా మీడియాలో చాలా బాగా నడిపిస్తున్నాడని అన్నాడు.

Next Story