Video : గిల్ కూడా మొద‌లుపెట్టాడు..!

రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌కు ఆడుతున్న భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.

By Medi Samrat  Published on  29 Jan 2025 2:44 PM IST
Video : గిల్ కూడా మొద‌లుపెట్టాడు..!

రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌కు ఆడుతున్న భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కర్నాటకపై సెంచరీ చేసి విమర్శకులకు గ‌ట్టి రిప్లై ఇచ్చాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు, కానీ రంజీ ట్రోఫీలో సెంచరీ సాధించి టీమిండియా టెన్షన్‌ను తొలగించాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మైదానంలో పరిగెడుతూ కష్టపడుతున్న అతని వీడియో ఇటీవల వైరల్ అవుతోంది.

వీడియోలో శుభ్‌మాన్ గిల్.. మైదానంలో జాగింగ్ చేస్తూ కనిపిస్తాడు. గిల్ తన ఫిట్‌నెస్‌పై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు స‌బంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇటీవ‌ల కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా వైర‌ల‌య్యాయి.

తాజాగా కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 171 బంతుల్లో 14 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా గిల్‌ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. త‌ర్వాత‌ శుభ్‌మాన్ గిల్ జనవరి 30 నుండి బెంగాల్‌తో రంజీ ట్రోఫీలో ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. గిల్‌ను టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా నియమించారు సెల‌క్ట‌ర్లు.


Next Story