మా మధ్య గొడవలా..? క్లారిటీ ఇచ్చిన‌ గిల్

హార్దిక్ పాండ్యాతో విభేదాలు ఉన్నాయనే పుకార్లను స్టార్ ఇండియా బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తోసిపుచ్చాడు.

By Medi Samrat
Published on : 31 May 2025 8:15 PM IST

మా మధ్య గొడవలా..? క్లారిటీ ఇచ్చిన‌ గిల్

హార్దిక్ పాండ్యాతో విభేదాలు ఉన్నాయనే పుకార్లను స్టార్ ఇండియా బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తోసిపుచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ (జిటి) మధ్య జరిగిన టాస్ సమయంలో, ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేయకుండా ఉండటంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే ప్రచారం సాగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే, గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వివరణ ఇవ్వడం ద్వారా ఆ పుకార్లన్నింటినీ కొట్టిపారేశాడు. GT కెప్టెన్ పాండ్యాతో ఉన్న రెండు ఫోటోలను పంచుకున్నాడు. "ఇంటర్నెట్‌లో మీరు చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు" అని పాండ్యాను స్టోరీలో ట్యాగ్ చేస్తూ పుకార్లకు చెక్ పెట్టాడు.

Next Story