భారత యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ హైదరాబాద్ వన్డేలో అదరగొట్టాడు. న్యూజిలాండ్ తో మొదటి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. గిల్ స్కోరులో 19 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. ఆఖర్లో షిప్లే బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గిల్ డబుల్ సెంచరీ సాయంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్ 2, షిప్లే 2, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నెర్ 1, మిచెల్ శాంట్నర్ 1 వికెట్ తీశారు.
ఈ డబుల్ సెంచరీతో గిల్ వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. గిల్ విధ్వంసం ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. గిల్ 87 బంతుల్లోనే సెంచరీ చేయగా.. డబుల్ సెంచరీకి ఇంకా తక్కువ బంతులు తీసుకోవడం విశేషం.