గిల్ గురించి గుడ్‌న్యూస్ చెప్పిన రోహిత్..!
అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ ఘర్షణకు యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 99 శాతం
By Medi Samrat Published on 13 Oct 2023 8:24 PM ISTఅక్టోబర్ 14న పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ ఘర్షణకు యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 99 శాతం అందుబాటులో ఉన్నాడని భారత కెప్టెన్ రోహిత్ శర్మ ధృవీకరించారు. రోహిత్ శర్మ, ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ హెల్త్ గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు.
డెంగ్యూ నుంచి కోలుకున్న గిల్ భారత్ తరఫున వన్డే ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. గిల్‌కు కొద్దిరోజుల కిందట డెంగ్యూ జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీని కారణంగా అతను ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్ గా వచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుతో కలిసి గిల్ ఢిల్లీకి వెళ్లలేదు. అయితే అతను తన సహచరులను కలవడానికి నేరుగా అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. గిల్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ ఏడాది గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడు భారతజట్టు లోకి తిరిగి రావడం టీమ్ ఇండియాకు మంచి బ్యాలెన్స్ ను అందిస్తుంది. జనవరిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న గిల్.. మహ్మద్ సిరాజ్, ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలన్‌లను ఓడించి, ఈ సంవత్సరంలో రెండవసారి ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు.