'శుబ్‌మన్ గిల్ మంచి ఎంపిక.. కానీ..' బీసీసీఐకి సలహా ఇచ్చిన లెజెండ‌రీ కెప్టెన్‌

టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది.

By Medi Samrat
Published on : 27 May 2025 6:08 PM IST

శుబ్‌మన్ గిల్ మంచి ఎంపిక.. కానీ.. బీసీసీఐకి సలహా ఇచ్చిన లెజెండ‌రీ కెప్టెన్‌

టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమ్ ఇండియా తదుపరి కెప్టెన్ ఎవరన్నదానిపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ రేసులో శుభ్‌మన్ గిల్ పేరు ముందుంది.. అదే జరిగింది.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ టూర్‌లో గిల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. గిల్ విషయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా బీసీసీఐకి సలహా ఇచ్చాడు.

గిల్ గురించి, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మాట్లాడుతూ.. గిల్ అద్భుతమైన ఆటగాడు.. అతని కెప్టెన్సీ భారత క్రికెట్ మంచి వ్య‌క్తి చేతుల్లో ఉందని చూపిస్తుంది. అతను ఒత్తిడిని బాగా ఎదుర్కోగ‌ల‌డు. బాగా ఆలోచించండి. అతని బృందం అతన్ని గౌరవిస్తుంది. అతను గొప్ప ఎంపిక, కానీ ఆ పాత్రలో ఎదగడానికి మీరు అతనికి సమయం ఇవ్వాలి. కోట్లాది మందికి ప్రాతినిధ్యం వహించడం పెద్ద బాధ్యత. వారిపై చాలా ఒత్తిడి ఉంటుంది’’ అని అన్నారు.

గిల్ ఇంకా భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించలేదు, అయితే అతను ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో గిల్ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకువెళ్లాడు.ఈ జట్టు టైటిల్ పోటీదారుగా ఉంది. గత సీజన్‌లోనే గిల్ ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతడు 2022 నుండి ఈ జట్టులో సభ్యుడు.

Next Story