ఇండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లో డ్యూక్స్ బంతి నాణ్యత గురించి మరోసారి చర్చ మొదలైంది. అందించిన బంతి నాణ్యత సరిగా లేకపోవడంపై భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, మహమ్మద్ సిరాజ్ అంపైర్‌తో మాట్లాడారు. గురువారం 80 ఓవర్ల మార్క్‌లో రెండవ కొత్త బంతిని తీసుకుంది. శుక్రవారం కొత్త బంతి పరిస్థితిపై భారత్ అసంతృప్తి చెందింది. అప్పటికి అది దాదాపు 10 ఓవర్ల పాతది. హూప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైన తర్వాత అంపైర్లు బంతిని మార్చారు.
ఆ తర్వాత గిల్ అంపైర్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రత్యామ్నాయంగా తీసుకున్న బంతి ఆకారం కూడా నచ్చలేదు. "ఇది 10 ఓవర్ల పాత బంతినా? నిజంగానే?" సిరాజ్ స్టంప్ మైక్ లో అంటున్న మాటలు వినిపించాయి. ఈ నిర్ణయం భారత్ కు మైనస్ గా మారింది. ఆ తర్వాత జెమీ స్మిత్ హాఫ్ సెంచరీ కొట్టగా, టెయిలెండర్ కార్స్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.