India vs Pakistan : రోహిత్ అతడిని ఎందుకు పక్కన పెట్టాడో?

ఆసియా కప్‌ 2023 లో భారత్ తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌ జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

By Medi Samrat  Published on  2 Sep 2023 9:50 AM GMT
India vs Pakistan : రోహిత్ అతడిని ఎందుకు పక్కన పెట్టాడో?

ఆసియా కప్‌ 2023 లో భారత్ తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌ జట్టును ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలెలో నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించాడు. ఇక మ్యాచ్‌కి ఒక రోజు ముందు పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

పాకిస్థాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్.

ఈ మ్యాచ్ లో బుమ్రా జట్టులోకి తిరిగి రాగా.. మొహమ్మద్ షమీని పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది షమీ జట్టులో భాగంగా ఉంటారని అనుకున్నారు. అయితే జట్టు మేనేజ్మెంట్ అతడిని తుది జట్టులోకి తీసుకోలేదు.

Next Story