ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత టెస్టు క్రికెట్ నుంచి విరామం తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ తన మౌనాన్ని వీడాడు. చాలా ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయలేనని శ్రేయాస్ చెప్పాడు. తనకు వెన్ను సమస్య ఉందని, దీంతో వరుసగా రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేనని చెప్పాడు. అందుకే అతను రెడ్ బాల్ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అడిలైడ్ వన్డేలో శ్రేయాస్ అయ్యర్ 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో టీం ఇండియా గెలవలేక సిరీస్‌ను చేజార్చుకుంది.
వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించడం గురించి శ్రేయాస్ అయ్యర్‌ను అడగగా అతను బదులిస్తూ.. నాకు వెన్నునొప్పి ఉందని, దీని కారణంగా నేను వరుసగా రెండు రోజులు ఫీల్డింగ్ చేయలేనని చెప్పాడు. అందుకే రెడ్ బాల్ క్రికెట్‌కు విరామం ఇచ్చానని పేర్కొన్నాడు.
శ్రేయాస్ మాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్ విషయానికి వస్తే.. నేను కొన్ని ఓవర్ల కంటే ఎక్కువ ఫీల్డింగ్ చేసినప్పుడల్లా, గ్రౌండ్‌లో నా జోరు తగ్గుతుందని.. అంతర్జాతీయ స్థాయిలో ఉండాలంటే ఒత్తిడి తీవ్రతను తగ్గించుకోవాలని నాకు తెలుసు. అందుకే నేను ఆ విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. వన్డే క్రికెట్‌లో ఒకరోజు ఫీల్డింగ్ చేసిన తర్వాత మరుసటి రోజు విశ్రాంతి తీసుకుంటే తేలిగ్గా కోలుకోవచ్చని పేర్కొన్నాడు.
IPL 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లడంలో శ్రేయాస్ అయ్యర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇదిలావుండగా.. అయ్యర్ టీ20 టీమ్ ఇండియాలో ఇంకా చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా, అయ్యర్ 2024 నాటికి టెస్టు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకు అయ్యర్ 14 టెస్ట్ మ్యాచ్‌లలో 811 పరుగులు, 72 ODIలలో 2,917 పరుగులు, 51 T20 మ్యాచ్‌లలో 1,104 పరుగులు చేశాడు.