కొంత హోంవర్క్ చేయండి.. పుకార్లను కొట్టిపారేసిన అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం భారత జట్టులోకి పునరాగమనం కోసం చూస్తున్నాడు.
By Kalasani Durgapraveen Published on 23 Oct 2024 2:01 PM ISTశ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం భారత జట్టులోకి పునరాగమనం కోసం చూస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడుతున్నాడు. ఇంతలో అతని గురించి ఒక వార్త వచ్చింది. అందులో అతడు మళ్లీ గాయపడ్డాడని చెప్పబడింది. అలాగే.. అతను ముంబై తదుపరి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. Cricbuzz ప్రకారం.. ఈ విషయమై BCCI వర్గాల ద్వారా సమాచారాన్ని పొందిన శ్రేయాస్ అయ్యర్ ఈ వార్తలను ఖండించాడు.
శ్రేయాస్ అయ్యర్ ముంబై జట్టు కోసం రంజీ ట్రోఫీలో వరుసగా 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇది భారత జట్టులో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేస్తుంది.
ఇటీవలి క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అయ్యర్ అగర్తలాకు వెళ్లడం లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అతనికి తెలియజేసింది. అక్కడ ముంబై నవంబర్ 26 నుండి త్రిపురతో తలపడనుంది. జట్టులోని మిగిలిన సభ్యులు అక్టోబర్ 23 ఉదయం అగర్తలాకు బయలుదేరనున్నారు. సోమవారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన MCA శ్రేయాస్ అయ్యర్ పేరు ప్రకటించలేదు.
ఈ క్రమంలోనే శ్రేయాస్ తన గాయం వార్తలను తప్పు అని కొట్టిపారేశాడు. అయ్యర్ ఎక్స్ లో.. మిత్రులారా వార్తలను ప్రచురించే ముందు కొంత హోంవర్క్ చేద్దాం అని రాశాడు. ఈ ట్వీట్‌తో శ్రేయాస్ గాయం వార్తలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న ప్రతి ఒక్కరినీ చెంపదెబ్బ కొట్టాడు.
మహారాష్ట్రపై సెంచరీ ఇన్నింగ్సు ఆడిన తర్వాత అయ్యర్ తన శరీరానికి విశ్రాంతి అవసరమని చెప్పాడు. ఇతరులు దాని గురించి ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను. గత కొన్ని సంవత్సరాలుగా నేను దాటిన పరిమితులు నాకు తెలుసు కాబట్టి.. నేను నా శరీరం మాట వినవలసి ఉంటుంది. దాని ఆధారంగా నేను సరైన నిర్ణయం తీసుకుంటాను. నా బృందం కూడా నాకు మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. ఈ విషయం ఎలా అర్ధమైందో గానీ అయ్యర్ మళ్లీ గాయపడ్డాడని వార్తలు వెలువడ్డాయి.
గతేడాది ప్రారంభంలో అయ్యర్ వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కోలుకున్న తర్వాత అతడు ఆసియా కప్, ప్రపంచ కప్ రెండింటిలోనూ ఆడాడు. ఆ తర్వాత భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు.