పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా పడింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు అతనికి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, కనీస ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించినట్లుగా ఐపీఎల్ తన ప్రకటనలో తెలిపింది.
తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. గుజరాత్ 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యువ బ్యాటర్ కూపర్ కనోలీ కేవలం 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు