Olympics : ప‌త‌కానికి అడుగు దూరంలో మను భాకర్..!

పారిస్ ఒలింపిక్స్-2024లో రెండోరోజు భార‌త్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించింది

By Medi Samrat  Published on  27 July 2024 6:55 PM IST
Olympics : ప‌త‌కానికి అడుగు దూరంలో మను భాకర్..!

పారిస్ ఒలింపిక్స్-2024లో రెండోరోజు భార‌త్‌కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 580 పాయింట్ల‌తో మూడో స్థానంలో నిలిచింది. భాకర్ మొదటి రౌండ్‌లో 97, రెండో రౌండ్‌లో 97, మూడో రౌండ్‌లో 98, నాలుగో రౌండ్‌లో 96, ఐదో రౌండ్‌లో 96, ఆరో రౌండ్‌లో 96 పాయింట్లు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. దీంతో తొలి ప‌త‌కంపై సస్పెన్స్ రేపు వీడ‌నుంది.

గత 20 ఏళ్లలో వ్యక్తిగత ఈవెంట్‌లో ఒలింపిక్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా షూటర్ మను భాకర్ కావ‌డం విశేషం. 2004లో ఏథెన్స్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో సుమ శిరూర్ చివరిసారి ఫైనల్‌కు చేరుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రిథమ్ సాంగ్వాన్ 15వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఒలింపిక్‌ పతక రేసు నుంచి నిష్క్రమించింది.

Next Story