మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించిన షోయబ్ మాలిక్

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కొట్టిపారేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) క్లబ్ ఫార్చూన్ బరిషల్‌తో విడిపోవాలనే తన నిర్ణయాన్ని వివరించారు.

By Medi Samrat  Published on  26 Jan 2024 4:01 PM GMT
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై స్పందించిన షోయబ్ మాలిక్

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కొట్టిపారేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) క్లబ్ ఫార్చూన్ బరిషల్‌తో విడిపోవాలనే తన నిర్ణయాన్ని వివరించారు. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌తో జట్టు నుండి వెళ్లిపోవాలని తన నిర్ణయాన్ని చర్చించానని.. అయితే జట్టుతో తన కాంట్రాక్ట్ రద్దయిందనే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని మాలిక్ ఖండించాడు. షోయబ్ మాలిక్ ఫార్చ్యూన్ బరిషల్ యజమాని మ్యాచ్ ఫిక్సింగ్ నివేదికలను ఖండించిన వీడియోను కూడా షేర్ చేశాడు. "షోయబ్ మాలిక్‌కు సంబంధించిన రూమర్‌ పై తీవ్రంగా చింతిస్తున్నాను. అతను గొప్ప ఆటగాడు. అతను మాకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. కాబట్టి అలాంటి విషయం గురించి మనం గొడవ చేయకూడదు" అని మిజానూర్ రెహ్మాన్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

జనవరి 22న ఖుల్నా టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్‌లో 3 నో బాల్‌లు వేయడంతో షోయబ్ మాలిక్ మ్యాచ్ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డాడనే అనుమానంతో ఫార్చూన్ బరిషాల్‌తో ఒప్పందం రద్దు చేసుకుందని స్థానిక మీడియా నివేదికలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని మాలిక్ వివరించాడు. దుబాయ్‌లో ముందస్తుగా అంగీకరించిన కొన్ని కమిట్మెంట్స్ కారణంగా మూడు గేమ్‌ల తర్వాత తాను బీపీఎల్ ను విడిచిపెట్టానని, టోర్నమెంట్ తర్వాతి దశల్లో అవసరమైతే అందుబాటులో ఉంటానని ఫ్రాంచైజీకి చెప్పానని షోయబ్ మాలిక్ చెప్పాడు. శుక్రవారం ఫార్చ్యూన్ బరిషల్ షోయబ్ మాలిక్ స్థానంలో అహ్మద్ షెహజాద్‌ను చేర్చుకుంది. పాకిస్థాన్ ఆల్ రౌండర్ మిగిలిన టోర్నీకి జట్టులోకి తిరిగి రాలేడని ఫార్చ్యూన్ బరిషల్ ధృవీకరించింది. BPL 2024 జనవరి 19 నుండి మార్చి 1 మధ్య నిర్వహించనున్నారు.

Next Story