రెండో పెళ్లి చేసుకున్న‌ షోయబ్‌ మాలిక్..!

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయిబ్‌ మాలిక్ విడిపోయారు.

By Medi Samrat  Published on  20 Jan 2024 3:15 PM IST
రెండో పెళ్లి చేసుకున్న‌ షోయబ్‌ మాలిక్..!

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయిబ్‌ మాలిక్ విడిపోయారు. గత కొంత కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. అయితే పాకిస్తాన్‌ నటి సనా మాలిక్‌ను షోయిబ్‌ మాలిక్‌ పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను షోయిబ్‌ మాలిక్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 2010లో అంగరంగ వైభవంగా ఈ జంట పెళ్లి చేసుకుంది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.

కొంత కాలం క్రితం.. విడాకులు, వివాహానికి సంబంధించిన సానియా మీర్జా తన ఇన్‌స్టా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.. "వివాహం కష్టం.. విడాకులు తీసుకోవడం కష్టం.. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి.." అని చెప్తూ పోస్ట్‌ చేసింది. దీంతో వీరి విడాకులు కన్ఫాం అయినట్లేనని అప్పట్లో చర్చ జరిగింది. తాజాగా తన పెళ్లి ఫొటోలను స్వయంగా షోయిబ్‌ ఇన్‌స్టాలో పెట్టడంతో ఇక వీరి వైవాహిక జీవితం ముగిసింది.

Next Story