Viral Video : అక్తర్‌కు త‌న టీ రుచి చూపించిన డాలీ చాయ్‌వాలా..!

పాకిస్థాన్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.

By Medi Samrat  Published on  1 Feb 2025 9:15 PM IST
Viral Video : అక్తర్‌కు త‌న టీ రుచి చూపించిన డాలీ చాయ్‌వాలా..!

పాకిస్థాన్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అతను తన ఫోటోలు, వీడియోలను వివిధ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తూ ఉంటాడు. ఇటీవల అతడు ఇంటర్నేషనల్ లీగ్ సందర్భంగా భారతదేశానికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్ వాలాను కలిశాడు. ఈ భేటీకి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. డాలీ తన ప్రసిద్ధ టీని అక్తర్, మాజీ భారత క్రికెటర్ సబా కరీమ్‌లకు అందించాడు. ఇంటర్నేషనల్ లీగ్ T20 వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌స్తుతం అక్తర్ UAEలో ఉన్నాడు.

వైరల్ అయిన వీడియోలో అక్తర్ తన అభిమానులకు డాలీని పరిచయం చేశాడు. ఈ సమయంలో అక్తర్ తన మ్యాచ్‌లను చూశారా అని డాలీని అడుగుతాడు. దీనికి డాలీ పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ల చాలా మ్యాచ్‌లను చూసినట్లు అంగీకరించాడు. సచిన్ టెండూల్కర్‌ను పాకిస్తాన్ బౌలర్లు అవుట్ చేసినప్పుడు ఎలా ఉన్నార‌ని అక్తర్ అతనిని అడిగాడు. దీనిపై డాలీ మాట్లాడుతూ.. నేను మీ మ్యాచ్‌లు చాలా చూశాను.. మీరు గొప్ప బౌలర్.. మీరు బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేస్తున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు.. ఎప్పుడూ బంతిని విసిరి కొట్టినట్లు అనిపించేది అన్నాడు. వీడియోలో అక్తర్.. డాలీ చేసిన టీని కూడా ప్రశంసించాడు.

అక్తర్ తన కెరీర్‌లో 46 టెస్టు మ్యాచ్‌లు ఆడి 82 ఇన్నింగ్స్‌లలో 25.69 సగటుతో 3.37 ఎకానమీతో 178 వికెట్లు తీశాడు.

11/78 టెస్టులో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. టెస్టుల్లో 12 సార్లు 5 వికెట్లు, రెండుసార్లు 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. షోయబ్ అక్తర్ తన కెరీర్‌లో 163 ​​వన్డే మ్యాచ్‌లు ఆడి 162 ఇన్నింగ్స్‌లలో 247 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వన్డేల్లో అక్త‌ర్‌ బౌలింగ్ సగటు 24.97గా ఉంది. ఎకానమీ 4.76గా ఉంది.

Next Story