ఆసియా కప్-2022 లో పాకిస్థాన్ ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓటమిని మూట గట్టుకుంది. పాకిస్థాన్ ఓటమికి ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ చాలా నెమ్మదిగా ఆడడం కూడా కారణమని విమర్శలు వస్తున్నాయి. కీలక మ్యాచ్ లో టాస్ ఓడిపోయినప్పటికీ శ్రీలంక విజయం సాధించింది. భానుక రాజపక్సే యొక్క 45 బంతుల్లో అజేయంగా 71 పరుగుల ఇన్నింగ్స్ కారణంగా.. శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అయితే ఛేజింగ్ లో ఎక్కడా కూడా పాకిస్థాన్ కావాల్సిన రన్ రేట్ తో పరుగులు చేయలేకపోయింది.
పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత షోయబ్ అఖ్తర్ పాక్ జట్టు ప్రదర్శనపై ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశాడు. ఓపెనింగ్ జోడీ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను విమర్శించాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చే ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇత్ఫికర్ అహ్మద్‌లను కూడా తీవ్రంగా విమర్శించాడు."This combination is not working. Pakistan has to look into a lot of things. Fakhar, Iftikhar, Khushdil all need to be looked into. And Rizwan, 50 off 50 is not going to work anymore. Doesn't benefit Pakistan. Hats off to Sri Lanka. What a team," ఈ కాంబినేషన్ పని చేయడం లేదని.. 50 బంతుల్లో 50 పరుగులు రిజ్వాన్ చేయడం జట్టుకు ఏ మాత్రం పనికి రాదని చెప్పుకొచ్చాడు. శ్రీలంక జట్టుకు హ్యాట్సాఫ్ అని కూడా తెలిపాడు.