ఐపీఎల్ ఆట‌గాడిపై రేప్ కేసు.. ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్ క్రికెటర్ శివాలిక్ శర్మను రేప్ కేసులో రాజస్థాన్ పోలీసులు వెతుకుతున్నారు.

By Medi Samrat
Published on : 2 May 2025 6:53 PM IST

ఐపీఎల్ ఆట‌గాడిపై రేప్ కేసు.. ఏ క్ష‌ణంలోనైనా అరెస్ట్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముంబై ఇండియన్స్ క్రికెటర్ శివాలిక్ శర్మను రేప్ కేసులో రాజస్థాన్ పోలీసులు వెతుకుతున్నారు. జోధ్‌పూర్‌లోని కుడి భగతసాని పోలీస్ స్టేషన్‌లో శివాలిక్ శర్మపై అత్యాచారం కేసు నమోదైంది. నిశ్చితార్థం, పెళ్లి సాకుతో క్రికెటర్ శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ జోధ్‌పూర్ కుడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్ర‌స్తుతం క్రికెటర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు, ఆత‌డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంది.

జోధ్‌పూర్ కమిషనరేట్ ఏసీపీ ఆనంద్ సింగ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెటర్ శివాలిక్ శర్మపై కుడి భగతసాని సెక్టార్ 2లో నివాసం ఉంటున్న యువ‌తి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2023 ఫిబ్రవరిలో శివాలిక్‌తో పరిచయం ఏర్పడినప్పుడు తాను గుజరాత్‌లోని వడోదరకు వెళ్లినట్లు నివేదికలో యువ‌తి తెలిపింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. ఫోన్‌లో మాట్లాడుకుంటుండ‌గా సాన్నిహిత్యం పెరిగింది. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు కూడా ఒకరినొకరు కలిశారు. శివాలిక్ తల్లిదండ్రులు ఆగస్ట్ 2023లో జోధ్‌పూర్ వచ్చారు. దీని తర్వాత వారిద్దరూ వారి అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అమ్మాయి కథనం ప్రకారం.. నిశ్చితార్థం తర్వాత శివాలిక్ తిరిగి జోధ్‌పూర్‌కు వచ్చినప్పుడు శారీరకంగా ఒక్క‌ట‌య్యామ‌ని పేర్కొంది.

వీరిద్దరూ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లారు. 2024 ఆగస్టులో బాధితురాలిని వడోదరకు పిలిపించినప్పుడు.. శివాలిక్ తల్లిదండ్రులు అతను క్రికెటర్ అని ఆమెకు చెప్పారు. ఈ నిశ్చితార్థం ఇక కొనసాగదు. అత‌డికి సంబంధాలు ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం కేసు నమోదైంది.

వడోదర నివాసి శివాలిక్ శర్మ 2024లో ముంబై ఇండియన్ టీమ్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా, అతడు రంజీ ట్రోఫీలో వడోదర తరఫున కూడా ఆడాడు.

Next Story