Video : కోచ్‌లకు 'టీ' తీసుకువచ్చేవాణ్ని : శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగస్టు 2024లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 16 Jan 2025 9:17 PM ISTభారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగస్టు 2024లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఎడమచేతి వాటం ఆటగాడు తన ఫౌండేషన్‌కు సంబంధించి శిఖర్ ధావన్ ఫౌండేషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకున్నాడు. ఇందులో ధావన్ తన తొలిరోజుల నాటి క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు.
పిల్లలతో ఇంటరాక్ట్ అయిన శిఖర్ ధావన్ చిన్న వయసులోనే క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. టోర్నీలో ఆడే అవకాశం కోసం ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రారంభంలో తన పోరాటం గురించి చెబుతూ.. తను చాలా రకాల పనులు చేశానని చెప్పాడు.
నేను చిన్న వయస్సులో క్లబ్ కోసం ఆడటం ప్రారంభించాను. ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసాను. ఆపై టోర్నమెంట్ ఆడే అవకాశం వచ్చింది. ఒక సంవత్సరం పాటు నేను పిచ్‌లు రోల్ చేయడం, కోచ్‌లకు టీ తీసుకురావడం, ఎండలో ఎక్కువ గంటలు పనిచేయడం వంటి ఎన్నో పనులు చేసాను.. 10 నిమిషాలు బ్యాటింగ్ వస్తుందని ఆశతో నేను చాలా చేశానని తొలినాళ్ల కష్టాలను గుర్తుచేసుకున్నాడు ధావన్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శిఖర్ ధావన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడాడు. శిఖర్ భారతదేశం తరపున 167 ODI మ్యాచ్‌లు ఆడాడు మరియు. అతను 44.11 సగటుతో 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. శిఖర్ ధావన్ 90.75 సగటుతో 363 పరుగులు చేశాడు.
శిఖర్ ధావన్ భారత్ తరఫున 34 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2013లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. శిఖర్ టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 68 టీ20ల్లో 11 అర్ధసెంచరీలతో 1,759 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌తో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. చాలా కాలం పాటు జట్టుకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ తన క్రికెట్ కెరీర్‌ను 2024లో ముగిస్తున్నట్లు ప్రకటించాడు.