విండీస్ తో సిరీస్ కు భారతజట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?

Shikhar Dhawan to lead India in three ODIs vs West Indies. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత జట్టుకు

By Medi Samrat  Published on  6 July 2022 4:32 PM IST
విండీస్ తో సిరీస్ కు భారతజట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వెటర్ ఓపెనర్ శిఖర్ ధావన్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటన కోసం మొత్తం 16 మందితో జట్టును ప్రకటించింది. భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, ఆవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్

ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జూలై 22న ప్రారంభమయ్యే వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ భారత కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లకు ఈ సిరీస్‌లో విశ్రాంతి లభించింది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ వన్డేలకు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది.










Next Story