అభిమానులకు సరికొత్త జెర్సీ చూపించిన శిఖర్ ధావన్

Shikhar Dhawan showcases Indian team’s new ‘retro’ limited-overs jersey. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్ లో

By Medi Samrat  Published on  25 Nov 2020 9:00 AM IST
అభిమానులకు సరికొత్త జెర్సీ చూపించిన శిఖర్ ధావన్

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్ లో ఒకప్పటి భారతకట్టు జెర్సీతో రంగం లోకి దిగబోతోందని వార్తలు వచ్చాయి. ఆ జెర్సీకి సంబంధించిన ఫోటోను భారతజట్టు ఓపెనర్ శిఖర్ ధావన్ సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. "New jersey, renewed motivation. Ready to go," అంటూ ధావన్ సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేశాడు. ఈ కొత్త జెర్సీలో భారతజట్టును చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.



నవంబర్ 27న సిడ్నీలో మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ మొదలుకానుంది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఈ సిరీస్ లో ఉన్నాయి. డిసెంబర్ 17 న అడిలైడ్ లో మొదటి టెస్టును నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడనుంది.

ధావన్ ఐపీఎల్ లో మంచి ఇన్నింగ్స్ లు ఆడి భారతజట్టులో స్థానం సంపాదించాడు. ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో నిలవగా.. ఢిల్లీ కేపిటల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గాయం కారణంగా రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సిరీస్ కు దూరం అవ్వడంతో ఈ సిరీస్ లో ధావన్ కు కొత్త ఓపెనర్ తో ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. కెఎల్ రాహుల్, శుభమన్ గిల్ లతో ఓపెనింగ్ చేయించే అవకాశాలు ఉన్నాయి.

ధావన్ వేసుకున్న జెర్సీ 1992 ప్రపంచకప్ లో భాగంగా భారతజట్టు జెర్సీని పోలి ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా కొత్త జెర్సీతోనే రంగంలోకి దిగనుంది.


Next Story