భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ జీవితంలో కొత్త శుభారంభం చేసేందుకు సిద్ధమయ్యాడు. ధావన్ తన కొత్త విదేశీ స్నేహితురాలు సోఫీ షైన్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని ధావన్ సోమవారం తెలిపాడు. ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. ధావన్ రెండోసారి పెళ్లి చేసుకోనున్నాడు. రెండవసారి కూడా ధావన్ విదేశీయురాలినే చేసుకోవడం విశేషం. గతంలో ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీని పెళ్లాడాడు. ఆమె ధావన్ కంటే 12 సంవత్సరాలు పెద్దది. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. వారిద్దరూ అక్టోబర్-2023లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ధావన్ తన మనసును విదేశీ అమ్మాయికి ఇచ్చి పెళ్లికి సిద్ధమయ్యాడు.