నన్ను వాడుకొని వదిలేసింది.. ఇద్దరితో అఫైర్స్ : మేరీ కోమ్ మాజీ భర్త

దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ తన మాజీ భర్తపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

By -  Medi Samrat
Published on : 14 Jan 2026 9:58 AM IST

నన్ను వాడుకొని వదిలేసింది.. ఇద్దరితో అఫైర్స్ : మేరీ కోమ్ మాజీ భర్త

దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ తన మాజీ భర్తపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఓన్‌కోలర్‌ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. మేరీకి వివాహేతర సంబంధాలు ఉండేవని, అందుకు సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్నాయని సంచలన కామెంట్లు చేశాడు. 2013లో ఓ జూనియర్‌ బాక్సర్‌తో మేరీకి ఎఫైర్‌ ఉండేది.. ఇది తెలిసి మా కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెద్దలు సర్దిచెప్పడంతో రాజీకి వచ్చామన్నాడు. ఇక 2017 నుంచి మేరీ అకాడమీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు సాక్ష్యంగా వారిద్దరి వాట్సాప్‌ మెసేజ్‌లు తన దగ్గర ఉన్నాయన్నాడు.

ఇప్పటికీ తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని కరుంగ్‌ ఓన్‌కోలర్‌ చెప్పాడు. ఆమె నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపాడు. అకాడమీని మొదటి నుండి తానే అన్నీ అయి చూసుకున్నానని, కానీ ఇప్పుడు ఆ అకాడమీకి చైర్మన్‌గా ఎవరున్నారో చూడాలన్నాడు. మేరీ, కరుంగ్‌ పెళ్లి 2005లో జరిగింది. వీళ్లకు ముగ్గురు మగ పిల్లలు కాగా, ఓ పాపను దత్తత తీసుకున్నారు. 2023లో తమ సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నామని మేరీ ప్రకటించింది. అప్పులపాలయ్యేలా చేసి, తన ఆస్తి కాజేయడంతోనే విడాకులు తీసుకున్నామంటూ మేరీ కోమ్‌ చెప్పడాన్ని ఆమె మాజీ భర్త కరుంగ్‌ ఓన్‌కోలర్‌ జీర్ణించుకోలేకపోతున్నారు.

Next Story