అలాంటి ఇన్నింగ్సు ఆడాడు మ‌రి.. సంజూ శాంసన్‌కు స్వాగ‌తం ప‌లికిన‌ శశి థరూర్..!

బంగ్లాదేశ్‌తో మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తుఫాను సెంచరీని చేశాడు.

By Medi Samrat  Published on  14 Oct 2024 2:47 PM IST
అలాంటి ఇన్నింగ్సు ఆడాడు మ‌రి.. సంజూ శాంసన్‌కు స్వాగ‌తం ప‌లికిన‌ శశి థరూర్..!

బంగ్లాదేశ్‌తో మూడో, చివరి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ తుఫాను సెంచరీని చేశాడు. సంజూ 47 బంతులు ఎదుర్కొని 111 పరుగులు చేయ‌గా అందులో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ తర్వాత సంజూ ప్రతిభపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సిరీస్ ముగిసిన తర్వాత సంజు తిరువనంతపురంలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంజుని కలిసి.. అతని ప్రదర్శనకు అభినందనలు తెలిపారు.

శశి థరూర్ తన X హ్యాండిల్‌లో సంజును కలిసిన ఫోటోల‌ను అప్‌లోడ్ చేశాడు. శశి థరూర్ క్యాప్షన్‌లో.. "బంగ్లాదేశ్‌పై తన అద్భుతమైన సెంచరీ తర్వాత సంజూ శాంసన్ తిరువనంతపురంలో తిరిగి వస్తున్నందున "టన్-అప్ సంజు"కి వెల్‌కమ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. అతడిని గౌరవించటానికి తగిన భారతీయ రంగుల్లోని పొన్నాడ దొరికింది అని పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఆ జ‌ట్టు లెగ్ స్పిన్నర్ రషీద్ హుస్సేన్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన సంజు 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రెండో వికెట్‌కు 173 పరుగులు జోడించాడు.

కోచ్, కెప్టెన్ ఇద్ద‌రి మాటల వల్లే తాను ఇలా బ్యాటింగ్ చేశానని మ్యాచ్ అనంతరం సంజూ చెప్పాడు. మ్యాచ్ అనంతరం సంజూ, సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ టీవీలో మాట్లాడారు చాలా కాలంగా ఈ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నావు క‌దా ఈ ఇన్నింగ్స్ గురించి చెప్పండి.? అని సూర్యకుమార్ సంజును అడిగాడు.

సంజు మాట్లాడుతూ.. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా ద‌గ్గ‌ర‌ మాటలు లేవు. నేను చాలా భావోద్వేగానికి లోనయ్యాను. కానీ ఈ రోజు వచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి ఓ సమయం ఉంటుంది. నేను నా పనిని చేస్తూనే.. నాపై నమ్మకం ఉంచాను. ఆ సమయంలో మీరు నాతో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నానని సూర్యతో అన్నాడు.

Next Story