టీ20 ప్రపంచకప్ ను భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే భారతజట్టును ప్రపంచకప్ కోసం ప్రకటించింది. ఆఖరి నిమిషంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్‌తో చర్చించిన తర్వాత అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ శార్దూల్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులో చేర్చింది. ఇంతకు ముందు 15 మంది సభ్యుల బృందంలో భాగమైన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పుడు స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో ఉండనున్నాడు.

ఐసిసి టి 20 ప్రపంచకప్ కోసం భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్ , శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.. స్టాండ్-బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, ఆక్సర్ పటేల్

అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కె. గౌతమ్ లు దుబాయ్‌లోని టీమ్ బబుల్‌లో చేరతారు. టీమ్ ఇండియా సన్నాహాల్లో సహాయం చేస్తారు.


సామ్రాట్

Next Story