ఎంగేజ్మెంట్ చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. అమ్మాయి ఎవరంటే..!

Shardul Thakur Gets Engaged To Long Time Girlfriend Mittali Parulkar. భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిట్టాలి పారుల్కర్‌తో సోమవారం

By Medi Samrat  Published on  29 Nov 2021 9:53 AM GMT
ఎంగేజ్మెంట్ చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. అమ్మాయి ఎవరంటే..!

భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిట్టాలి పారుల్కర్‌తో సోమవారం ముంబైలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్స్ కు చెందిన పెద్దలు, 75 మంది అతిథి జాబితాతో ఒక చిన్న నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాడు. "సోమవారం BKCలోని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఫెసిలిటీలో ఒక చిన్న ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ నిర్వహించారు. దగ్గర స్నేహితులు, కుటుంబ సభ్యులతో 75 మంది అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న T20 ప్రపంచకప్ తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంది" అని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

శార్దూల్ ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారత T20 జట్టులో తన స్థానాన్ని సుస్థిరాన్ని చేసుకోవాలని శార్దూల్ ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2021 T20 WC జట్టులో కూడా అక్షర్ పటేల్‌ స్థానంలో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయంగా వెళ్ళాడు. ఇక శార్దూల్ ముందుగానే దక్షిణాఫ్రికాకు బయలుదేరవచ్చు. దక్షిణాఫ్రికాతో సిరీస్ డిసెంబర్ 6న ప్రారంభమవుతుంది. శార్దూల్ అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని స్థిరం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్ ఇప్పటి వరకు 4 టెస్టు మ్యాచ్ లు, 15 వన్డే మరియు 24 టీ20 మ్యాచ్ లు భారత్ తరపున ఆడాడు. శార్దూల్ ఠాకూర్ భారత జట్టులో సాధారణ సభ్యుడిగా మారాడు, ప్రత్యేకించి ఓవర్సీస్ టెస్ట్ మ్యాచ్ లలో భారతదేశం నలుగురు పేసర్లను దించితే మాత్రం.. శార్దూల్ ఠాకూర్ అటు బౌలింగ్ తో పాటూ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉంది.


Next Story
Share it