భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ప్రపంచకప్ సన్నాహక పరంగా ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా అన్ని వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి బంతికి కమిన్స్, జంపా మూడు పరుగులు తీసేందుకు ప్రయత్నించగా.. జంపా రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ ఎదుట ఆస్ట్రేలియా 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 52 పరుగులు చేశాడు. జోస్ ఇంగ్లిస్ 45 పరుగులు, స్టీవ్ స్మిత్ 41 పరుగులతో రాణించారు. లాబుషాగ్నే కూడా 39 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీశాడు. బుమ్రా, అశ్విన్, జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది.