బుమ్రా స్థానంలో షమీ వచ్చేసాడు
Shami replaces Bumrah in India's T20 World Cup squad. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కింది.
By Medi Samrat Published on 14 Oct 2022 7:30 PM ISTఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కింది. గాయంతో ప్రపంచకప్ కు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇదివరకే బారత జట్టు ఆస్ట్రేలియా చేరుకోగా... శుక్రవారం షమీ కూడా ఆస్ట్రేలియా చేరుకున్నాడని, ప్రస్తుతం బ్రిస్బేన్ లోని భారత జట్టుతో అతడు కలుస్తాడని బీసీసీఐ తన ప్రకటనలో వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రిజర్వ్ లో షమీ ఉన్నాడు. తాజాగా బుమ్రా స్థానంలో అతడు తుది జట్టులోకి ఎంపికయ్యాడు. మరో ఇద్దరు బౌలర్లు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లను బీసీసీఐ రిజర్వ్ బెంచ్‌లోకి ఎంపిక చేసింది. వీరిద్దరూ త్వరలోనే ఆస్ట్రేలియా బయలుదేరతారని బీసీసీఐ వెల్లడించింది.
టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
షమీ చివరిసారిగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో నమీబియాపై భారత్ తరఫున ఆడాడు. ఇటీవల షమీ కోవిడ్ -19 బారిన పడి.. కోలుకున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లకు షమీ మిస్ అయ్యాడు.