పుజారాను డకౌట్ చేసి వాటేసుకున్న షమీ

Shami jumps and hugs Cheteshwar Pujara after dismissing him for a duck. టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్ టూర్ వార్మప్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు

By Medi Samrat  Published on  24 Jun 2022 1:27 PM GMT
పుజారాను డకౌట్ చేసి వాటేసుకున్న షమీ

టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, ఇంగ్లాండ్ టూర్ వార్మప్ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఐదో టెస్టు ఆరంభానికి ముందు జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా తరుపున కాకుండా లీస్టర్‌‌షైర్ తరుపున బరిలో దిగాడు ఛతేశ్వర్ పూజారా.

ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రాలకు లీస్టర్‌‌షైర్ కౌంటీ టీమ్‌లో చోటు కల్పించారు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన భారత జట్టు, రెండో రోజు బ్యాటింగ్ చేయకుండానే ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించింది.

కౌంటీల్లో అద్భుతమైన ఫామ్‌తో నాలుగు సెంచరీలు, అందులో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఛతేశ్వర్ పూజారా వార్మప్ మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో పూజారా క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అంతకుముందు లీస్టర్‌‌షైర్ కెప్టెన్ శామూల్స్ ఈవెన్స్‌ని 1 పరుగుకే పెవిలియన్ చేర్చిన మహ్మద్ షమీ, 6 బంతులాడి పరుగులేమీ చేయలేకపోయిన పూజారాని అవుట్ చేసిన తర్వాత, అతనిపై చేతులు వేసి ఏదో మాట్లాడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పుజారాను డకౌట్ చేసిన తర్వాత అతనితో కలిసి సంబరాలు చేసుకున్నాడు మహ్మద్ షమీ. షమీ వేసిన డెలివరీని పుజారా ఆడడానికి ప్రయత్నించగా.. అది ఇన్సైడ్ ఎడ్జ్ అయి.. వికెట్ ను తాకింది. దీంతో షమీ వికెట్ తీసుకున్నందుకు ఉప్పొంగిపోయాడు. పుజారా పెవిలియన్ కు వెళుతున్నప్పుడు పరిగెత్తి అతనిని కౌగిలించుకున్నాడు.Next Story
Share it