5 వికెట్లతో మెరిసిన షకీబ్.. 186 పరుగులకే భారత్ ఆలౌట్
Shakib's 5-36 keeps India down to 186. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న
By Medi Samrat Published on
4 Dec 2022 9:53 AM GMT

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్ మాత్రమే 73 పరుగులతో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 36 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఎబాదత్ హొస్సేన్ కూడా 47 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ సేన్ ఈ మ్యాచ్‌లో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపిక గొప్పగా లేదు. రివర్స్ స్వీప్ ఆడబోయి ఇద్దరు ఔట్ అవ్వగా.. కొన్ని సాఫ్ట్ డిస్మిస్‌లు కూడా జరిగాయి. KL రాహుల్ మాత్రమే ఒంటరి పోరాటం చేసాడు. భారత బౌలర్లు బంతితో రాణిస్తే తప్ప అద్భుతం జరిగే అవకాశం లేదు.
Next Story