కోహ్లీ ప్రాక్టీస్ పై షాహిద్ అఫ్రీది ట్వీట్ చూశారా..?

Shahid Afridi says its 'treat to watch' Virat Kohli's undivided attention in practice sessions. భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ లో మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా

By Medi Samrat
Published on : 6 Oct 2021 7:04 PM IST

కోహ్లీ ప్రాక్టీస్ పై షాహిద్ అఫ్రీది ట్వీట్ చూశారా..?

భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ లో మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే భారత ఆటగాళ్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది భారతజట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ పై విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. అయితే షాహిద్‌ ఆఫ్రిది ఆ వీడియోపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోహ్లీ పోస్ట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ.. "గొప్ప ఆటగాడి ప్రాక్టీస్ ఎల్లపుడు 100 శాతం ఇవ్వటానికే ప్రయత్నిస్తాడు - చూడటానికి కన్నుల పండుగగా ఉంది" అని పోస్ట్ చేసాడు. భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ కు ముందు పాక్ మాజీ క్రికెటర్ భారత కెప్టెన్ ను ఇలా ప్రశంసించడం విశేషం.


Next Story