ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్‌కు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ షఫాలీ వర్మ కెప్టెన్‌గా ఎంపికైంది. "ఆల్-ఇండియా మహిళల సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికా U19 సిరీస్ కోసం.. ICC U19 మహిళల ప్రపంచ కప్ కోసం భారతదేశ U19 మహిళల జట్టును ఎంపిక చేసింది" అని BCCI ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ అండర్-19 వుమెన్స్ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా స్టార్ బ్యాట్ వుమెన్ షఫాలీ వర్మ ఎంపికైంది. అండర్ -19 మహిళల ప్రపంచ కప్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. 2023 జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ జరుగనుంది. దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు స్కాట్లాండ్‌తో కలిసి భారత్ గ్రూప్-డీలో ఉంది.
ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ రౌండ్‌కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ లో ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. జనవరి 29న ఫైనల్ జరగనుంది.
ICC అండర్-19 మహిళల ప్రపంచ కప్ కోసం భారత U19 మహిళల జట్టు - షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్-కెప్టెన్), రిచా ఘోష్ (WK), త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు (WK) , సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్.
స్టాండ్‌బై ప్లేయర్లు: శిఖా, నజ్లా సీఎంసీ, యశశ్రీ.