భారత మహిళా క్రికెటర్ షెఫాలి వర్మ నవంబర్ 2025 గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. భారత మహిళల జట్టు 2025 వన్డే ప్రపంచ కప్ సాధించింది. టోర్నీ చివర్లో ప్రతీక రావల్ గాయపడటంతో అనుహ్యంగా జట్టులోకి వచ్చిన షెఫాలి సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చింది. 78 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక ఏడు ఓవర్లు వేసిన ఆమె 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఫైనల్ లో భారత్ గెలవడానికి కారణమైన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కడంపై మరోసారి ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి.