డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగిన షెఫాలీ.. సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న స్మృతి మంధాన

భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య జరుగుతున్న‌ ఏకైక టెస్టు మ్యాచ్‌లో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది.

By Medi Samrat  Published on  28 Jun 2024 4:23 PM IST
డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగిన షెఫాలీ.. సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న స్మృతి మంధాన

భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా మహిళల జట్టు మధ్య జరుగుతున్న‌ ఏకైక టెస్టు మ్యాచ్‌లో షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. ఆమె కంటే ముందు మిథాలీ రాజ్ ఈ ఫీట్ సాధించింది. మిథాలీ రాజ్ 2002లో టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించింది. కాగా.. షెఫాలీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న‌ మ్యాచ్‌లో నేడు డ‌బుల్ సెంచ‌రీ(205) చేయ‌గా.. అనంత‌రం రనౌట్ అయింది.

షెఫాలీతో పాటు స్మృతి మంధాన కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 149 పరుగుల‌తో సెంచ‌రీ సాధించింది. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు మొత్తం 292 పరుగుల భాగస్వామ్యం ఉంది. మంధాన, షెఫాలీల మధ్య 292 పరుగుల భాగస్వామ్యం మహిళల టెస్టు క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్డు సృష్టించింది.

మహిళల టెస్టు క్రికెట్‌లో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యాలు ఇవే..

స్మృతి మంధాన-షెఫాలీ వర్మ - 292 పరుగులు

కిరణ్ బలోచ్-సాజిదా షా - 241 పరుగులు

కరోలిన్ అట్కిన్స్-అర్రాన్ బ్రిండిల్ - 200 పరుగులు

Next Story