బంగ్లాదేశ్ కు భారీ షాకిచ్చిన స్కాట్లాండ్

Scotland won by 6 runs Against Bangladesh. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బాగానే ఎదుగుతూ ఉంది. వారి దేశంలో పెద్ద పెద్

By Medi Samrat  Published on  18 Oct 2021 5:27 AM GMT
బంగ్లాదేశ్ కు భారీ షాకిచ్చిన స్కాట్లాండ్

ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు బాగానే ఎదుగుతూ ఉంది. వారి దేశంలో పెద్ద పెద్ద టీమ్ లను కూడా మట్టికరిపించింది. అయితే బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ మెయిన్ లీగ్ లోని ఎంటర్ అవ్వాలంటే ఇంకో లీగ్ లో టాప్-2 లో ఉండాల్సి ఉండగా.. మొదటి మ్యాచ్ లో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ కు ఊహించని షాక్ ఇచ్చింది. పెద్ద పెద్ద టోర్నమెంట్లలో పలు జట్లకు షాకిచ్చే బంగ్లాదేశ్ కు ఇప్పుడు స్కాట్లాండ్ షాకిచ్చింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రిస్ గ్రీవ్స్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ మున్సీ 29, మార్క్ వాట్ 22 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మహేది హసన్ 3, ముస్తాఫిజుర్, షకీబ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అహ్మద్, సైఫుద్దీన్ చెరో వికెట్ పడగొట్టారు. ఒకానొక దశలో స్కాట్లాండ్ 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. గ్రీవ్స్ అద్భుతంగా ఆడడంతో 140 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ వేయడం స్కాట్లాండ్ కు ప్లస్ అయ్యింది.

141 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. షకీబల్ హసన్ 20, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 38, కెప్టెన్ మహ్మదుల్లా 23, అఫీఫ్ హొసైన్ 18 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ వీల్ 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ గ్రీవ్స్ రెండు, జోష్ డేవీ, మార్క్ వాట్ చెరో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగులో సత్తా చాటిన క్రిస్ గ్రీవ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 మ్యాచ్ లలో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకూడదని మరోసారి ఈ మ్యాచ్ రుజువు చేసింది.


Next Story
Share it