పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు మూడేళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన సర్ఫరాజ్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. పాక్ జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సర్ఫరాజ్ సీనియర్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశముంది. పాకిస్థాన్ క్రికెట్‌లో విజయవంతమైన సారథిగా చరిత్రకెక్కాడు సర్ఫరాజ్ అహ్మద్. అంతర్జాతీయంగా 100 మ్యాచుల్లో సారథిగా వ్యవహరించిన సర్ఫారాజ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పాకిస్థాన్ అండర్ -19 జట్టు 2006లో ఛాంపియన్‌గా నిలవడం, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం కారణంగా సర్ఫరాజ్ పాకిస్థాన్ కు బెస్ట్ కెప్టెన్స్ లో ఒకరుగా నిలిచిపోయాడు.
సర్ఫరాజ్ అండర్-19 వరల్డ్‌కప్ హీరోగా సీనియర్ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్, బ్యాటర్‌గా 2007లో భారత జట్టుపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20లు ఆడాడు. వికెట్ కీపర్‌గా రాణించి 315 క్యాచ్‌లు పట్టాడు. 56 మందిని స్టంపౌట్ చేశాడు.