కామన్వెల్త్ గేమ్స్‌లో ఖాతా తెరిచిన భారత్
Sanket Mahadev Sargar wins silver in weightlifting. బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత వెయిట్‌లిఫ్టర్
By Medi Samrat Published on
30 July 2022 1:22 PM GMT

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ శనివారం పురుషుల 55 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 21 ఏళ్ల సంకేత్ పతకం సాధించడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతా తెరిచింది. మొత్తం 248 కిలోల (స్నాచ్‌లో 113 కిలోలు, క్లీన్ & జెర్క్‌లో 135 కిలోలు) ఎత్తి పతకం సాధించాడు.
మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనిక్ మొత్తం 249 కేజీలు (107 + 142) ఎత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు కుమార యోదగే 225 కేజీలు (105 + 120) ఎత్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పతకం సాధించిన సంకేత్ మహదేవ్ సర్గర్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది.
Next Story