న్యూజిలాండ్‌తో మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌటైన శాంసన్ అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకి విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే.. శాంసన్ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్‌ల అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఏకంగా 12 సార్లు తొలి బంతికే ఔటయ్యాడు.