సానియా, షోయబ్ లు విడిపోనున్నారా..? అనుమానాలకు బలం చేకూర్చిన టెన్నిస్ స్టార్ పోస్ట్..!
Sania Mirza's Cryptic Post Amid Rumours Of Divorce From Shoaib Malik.సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌ల వివాహ బంధానికి
By తోట వంశీ కుమార్ Published on 8 Nov 2022 4:18 PM ISTభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల 12 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పడనుందని గత కొన్నిరోజులుగా పాకిస్తాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని, విభేదాల కారణంగా ఈ ఇద్దరూ విడాకులకు సిద్దం అయ్యారు అనేది ఆ వార్తల సారాంశం. ఇక ఇలాంటి వార్తలు ఎప్పుడూ వచ్చినా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి సమాధానం ఇస్తుంది సానియా మీర్జా.
అయితే.. తన ఇన్‌స్టాలో చేసిన పోస్టు ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పగిలిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి.. అల్లాను చేరేందుకేనా అంటూ సానియా తన ఇన్‌స్టాలో ఓ పోస్టు చేసింది.
వాస్తవానికి సానియా, మాలిక్‌ల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నాయో స్పష్టంగా తెలియనప్పటికీ వీరిద్దరు విడివిడిగా జీవిస్తున్నారని, షోయబ్ మాలిక్, సానియాను మోసం చేశాడు అని పాక్ మీడియా తెలిపింది.
2010 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సానియా, షోయబ్ నిఖా ఘనంగా జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. ఇటీవలే ఈ జంట తమ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసింది. ఈ ఫొటోలను షోయబ్ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటికీ, సానియా మాత్రం తాను, తన కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.
దీనితో పాటు ఇటీవల కొడుకు తనను ఆపాయ్యంగా ముద్దాడుతున్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది సానియా. "కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చే క్షణాలు" అంటూ ఆ ఫోటోలను క్యాప్షన్ ఇచ్చింది.
తాజాగా ఇన్‌స్టా స్టోరీలో "ముక్కలైన హృదయం ఎక్కడికి వెలుతుందో" అంటూ రాయడం అనుమానాలకు బలం పెంచుతోంది.
కాగా.. ఈ వార్తలపై ఇటు సానియా గానీ, అటు షోయబ్ గానీ ఇంతవరకు స్పందించలేదు.