ఆయ‌న కళ్ల‌లోకి నేరుగా చూడ‌లేకపోయాను : సంజూ శాంసన్

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ తుఫాను సెంచరీ సాధించాడు.

By Medi Samrat  Published on  22 Oct 2024 3:04 PM IST
ఆయ‌న కళ్ల‌లోకి నేరుగా చూడ‌లేకపోయాను : సంజూ శాంసన్

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జట్టు యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ తుఫాను సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి టీ20 అంతర్జాతీయ సెంచరీ. సంజూ ఈ ఇన్నింగ్స్‌తో అందరూ సంతోషించారు. సంజూ ఇన్నింగ్స్‌పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి కోచ్ గౌతం గంభీర్ వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త కోచ్ గంభీర్ కళ్లను చూడాలంటే సంజూ భయపడ్డ‌ సమయం కూడా ఉంది.

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సంజూ 111 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ 297 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20లో టీమిండియాకు ఇదే అతిపెద్ద స్కోరు. ఈ మ్యాచ్‌లో భారత్ 133 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గంభీర్ తనకు మద్దతుగా నిలిచినందుకు సంజూ ప్రశంసించాడు. మంచి కోచ్-ప్లేయర్ సంబంధాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అని చెప్పాడు. ఫస్ట్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. “కోచ్, ఆటగాడి మధ్య సంబంధం చాలా ముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను. కోచ్ ఆట‌గాడి సామర్థ్యాన్ని నమ్ముతారు. ఆట‌గాడు మంచి ప్రదర్శన చేయడం ద్వారా దానికి అనుగుణంగా జీవించాలి. నా మీద నీకు నమ్మకం ఉంటే నిన్ను వదలనని హైదరాబాదులో గౌతీ భాయ్‌కి చెప్పాలనుకున్నాను. తొలి మ్యాచ్‌లలో పెద్దగా స్కోర్ చేయలేదు. గౌతమ్ భాయ్ కళ్ల‌లోకి నేరుగా చూడ‌లేకపోయాను.. కానీ నా సమయం వస్తుందని నేను చెప్పాను. నేను హైదరాబాద్‌లో నేను సెంచరీ సాధించినప్పుడు కోచ్ చప్పట్లు కొట్టాడని పేర్కొన్నాడు.

సంజూ చాలా కాలంగా టీమ్ ఇండియాకు ఆడుతున్నాడు. కానీ జ‌ట్టులోకి వ‌స్తూ పోతూ ఉన్నాడు. అతనికి ఎప్పుడూ వరుసగా అవకాశాలు రాలేదు. ఈ సెంచరీ తర్వాత తనకు వ‌రుస‌ అవకాశాలు వస్తాయని సంజూ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాలో సంజు కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. అతడు ఫైనల్‌లో ఆడాల్సి ఉండగా టాస్‌కు పది నిమిషాల ముందు డ్రాప్ అయ్యాడు.

Next Story