ఫుల్ ఎమోషనల్ అయిన సాక్షి ధోని

Sakshi Dhoni gets emotional as MSD finishes things off in style against DC. మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ను ముగించి తన జట్టును ఫైనల్ కు తీసుకుని

By Medi Samrat  Published on  11 Oct 2021 4:39 AM GMT
ఫుల్ ఎమోషనల్ అయిన సాక్షి ధోని

మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ను ముగించి తన జట్టును ఫైనల్ కు తీసుకుని వెళ్ళాడు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ సాక్షి ధోనీ భావోద్వేగానికి గురయ్యారు. రవీంద్ర జడేజా కంటే ముందుగానే ప్రమోట్ చేసుకున్న ధోనీ మ్యాచ్ ను తనదైన శైలీలో ఫినిష్ చేశాడు. ధోనీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులే అయింది. 6 బంతుల్లోనే 18 పరుగులు చేసి ధోని మ్యాచ్ ను ముగించగా.. సాక్షి ధోని ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తె జీవాను పట్టుకుని ఏడ్చేసిన పని చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మూడు పరుగుల వద్దే డుప్లెసిస్ (1) వికెట్‌ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకుంది. రాబిన్ ఉతప్ప, రుతురాజ్ గైక్వాడ్ రాణించారు. ధోనీ 6 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో ఫినిష్ చేశాడు. గైక్వాడ్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేయగా, ఉతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో హై డ్రామా నడిచింది. చెన్నై విజయానికి 13 పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. దీనికితోడు ఓవర్ తొలి బంతికే మొయిన్ అలీ (16) వికెట్ కోల్పోయింది. ధోనీ ఫోర్లతో మ్యాచ్ ను ముగించాడు. ఫలితంగా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌కు చేర్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ దానిని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్ పృథ్వీషా, కెప్టెన్ పంత్‌, హెట్‌మెయిర్ రాణించారు. పృథ్వీషా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా నిలిచి 51 పరుగులు చేశాడు. హెట్‌మెయిర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. 70 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన రుతురాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Next Story
Share it