ఆ జ్ఞాప‌కాన్ని షేర్ చేసిన సైనా.. నెట్టింట వైర‌ల్‌

Saina Nehwal, Parupalli Kashyap go on their first ever beach vacay. క‌రోనా లాక్‌డైన్ కార‌ణంగా ఏడు నెలలకు పైగా ఇంటికే ప‌రిమిత‌మైన‌ భారత బ్యాడ్మింటన్ స్టార్స్

By Medi Samrat  Published on  20 Nov 2020 12:04 PM IST
ఆ జ్ఞాప‌కాన్ని షేర్ చేసిన సైనా.. నెట్టింట వైర‌ల్‌

క‌రోనా లాక్‌డైన్ కార‌ణంగా ఏడు నెలలకు పైగా ఇంటికే ప‌రిమిత‌మైన‌ భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ దంప‌తులు మూడు వారాల క్రితం విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లిన విష‌యం తెలిసిందే. వీరితో పాటు సాయి ప్రణీత్, గురు సాయి దత్ లు కూడా విహార‌యాత్ర‌‌కు వెళ్లారు.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా విదేశీ ప్రయాణాలు క‌ఠిన‌త‌రం చేయబడటంతో.. అనేక జాగ్ర‌త్త‌ల న‌డుమ విహార‌యాత్ర‌కు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని వారు పేర్కొన్నారు. ఇక‌ కశ్యప్, సైనా దంప‌తులు నాలుగు రోజుల క్రితం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జై రాం ఠాకుర్‌తో భేటీ అయ్యారు. ఇదిలావుంటే.. ఈ దంప‌తులు టూర్‌లో చిల్ అవుతున్న ఫోటోల‌ను ఎప్ప‌టికప్పుడు షేర్ చేయ‌గా అవి సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఆ టూర్‌కు సంబంధించి ఓ జ్ఞాప‌కాన్ని ల‌వ్ ఎమోజీల‌తో ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అయ్యింది.



ఇదిలావుంటే.. గురు సాయి దత్ టూర్ టూర్‌ విష‌యాల‌ను ఓ జాతీయ మీడియాకు వెల్ల‌డిస్తూ.. మేము మా జీవిత‌ భాగస్వాములతో కలిసి టూర్‌కు వెళ్ళడం ఇదే మొదటిసారి. "మేము ఎప్పుడూ కలిసి ప్రయాణించాలనుకుంటున్నాము. మహమ్మారి కారణంగా ఎటువంటి టోర్నమెంట్లు లేక‌పోవ‌డంతో.. అంద‌రం క‌లిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం మాకు లభించింది. మొదట్లో మేము గోవాకు వెళ్లాలని అనుకున్నాము.. కానీ అక్క‌డ‌కు వెళ్ల‌డం కుద‌ర‌లేదు. త‌ర్వాత మేం మాల్దీవ్స్ టూర్‌లో ఉన్న‌ తాప్సీ ఫోటోల‌ను చూశాం.. ఆ త‌ర్వాత టూర్‌లో వారు తీసుకున్న జాగ్రత్తల గురించి తెలుసుకుని అక్కడకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అక్క‌డ‌ చాలా సరదాగా ఎంజాయ్ చేశామ‌ని తెలిపాడు.


Next Story