సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

Sachin Tendulkar Turns 49, Wishes Pour In On Social Media. సచిన్ టెండూల్కర్‌ 49వ బ‌ర్త్ డే నేడు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాస్టర్ బ్లాస్టర్‌కు

By Medi Samrat  Published on  24 April 2022 6:04 PM IST
సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

సచిన్ టెండూల్కర్‌ 49వ బ‌ర్త్ డే నేడు జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాస్టర్ బ్లాస్టర్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు క్రికెట్ లెజెండ్ పుట్టినరోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేశారు.

భారత మాజీ క్రికెటర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎస్ బద్రీనాథ్ ముంబైలోని వాంఖడే స్టేడియం నుండి తమిళంలో హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు - ఇక్కడ భారతదేశం శ్రీలంకను ఓడించి క్రికెట్ ప్రపంచ కప్‌ను 2011లో గెలుచుకుంది.

స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ 'గాడ్'తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు.

సచిన్‌ను '50ల క్లబ్'కి స్వాగతిస్తూ, మాజీ క్రికెటర్, నటుడు, ముంబై క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా సచిన్‌తో కలిసి సెపియా-టోన్ ఫోటోను పంచుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఏప్రిల్ 24, 1973న ముంబైలో జన్మించిన సచిన్.. 1989లో పాకిస్థాన్‌పై 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. నవంబర్ 2013లో అన్ని ఫార్మ‌ట్‌ల క్రికెట్‌ నుండి రిటైర్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అగ్రగామి క్రికెట‌ర్‌గా నిలిచాడు.

Next Story