ఆ టోర్నమెంట్‌లో సచిన్ ఆడడం లేదు
Sachin Tendulkar not part of legends league cricket. సచిన్ టెండూల్కర్.. రిటైర్మెంట్ ప్రకటించి చాలా రోజులు అయినా కూడా తిరిగి మైదానంలో
By Medi Samrat Published on 8 Jan 2022 6:27 PM ISTసచిన్ టెండూల్కర్.. రిటైర్మెంట్ ప్రకటించి చాలా రోజులు అయినా కూడా తిరిగి మైదానంలో చూడాలని అనుకుంటున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో సచిన్ ఆడబోతున్నాడనే వార్తలు అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్ రాబోయే లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భాగం కాదని SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం వివరణ ఇచ్చింది.
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన లీగ్ ప్రమోషనల్ వీడియోను చూసి టెండూల్కర్ కూడా లీగ్‌లో భాగం కాబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎటువంటి నిజం లేదని చెబుతున్నారు. "లెజెండ్స్ లీగ్ క్రికెట్లో @sachin_rt పాల్గొంటున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. క్రికెట్ అభిమానులను అమితాబ్ బచ్చన్‌ను తప్పుదోవ పట్టించే పనిని నిర్వాహకులు మానుకోవాలి" అని SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక ప్రతినిధి తెలిపారు.
జనవరి 20, 2022 నుండి ఒమన్‌లోని మస్కట్‌లో ప్రారంభమయ్యే లెజెండ్స్ లీగ్ క్రికెట్ కోసం ఇండియా మహారాజాస్ జట్టులో మహమ్మద్ కైఫ్, స్టువర్ట్ బిన్నీ వంటి వారు ఉన్నారు. అధికారిక ప్రకటనలో, లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమీషనర్ రవిశాస్త్రి మాట్లాడుతూ, "భారత క్రికెట్‌కు మహ్మద్ కైఫ్ మరియు స్టువర్ట్ బిన్నీల సహకారం చాలా పెద్దది. అదేవిధంగా లీగ్‌లో కూడా వారు కూడా అపారమైన పాత్ర పోషిస్తారని నేను భావిస్తున్నాను. వారు లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడడాన్ని ప్రజలు ఆస్వాదిస్తారు." అని తెలిపారు.
ఈ లీగ్ మొదటి సీజన్‌లో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇతర క్రికెట్ దేశాల నుండి మాజీ క్రికెటర్లు మూడు జట్లుగా విభజించబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించడానికి లెజెండ్స్ ఆఫ్ క్రికెట్ కష్టపడుతూ ఉన్నారు.