సూర్య కుమార్ ఆటపై, ఐపీఎల్ పాత్రపై సచిన్ కీలక కామెంట్లు
Sachin Tendulkar credits Indian Premier League for developing India's bench strength. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో సూర్య కుమార్
By తోట వంశీ కుమార్ Published on 20 March 2021 2:28 PM ISTఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు తమ మొదటి ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ లోనే మంచి ప్రదర్శన కనబరిచారు. సూర్య, ఇషాన్ లు ఏ మాత్రం టెన్షన్ పడకుండా ఆడిన తీరును పలువురు మెచ్చుకుంటూ ఉన్నారు. ఇది ముఖ్యంగా ఐపీఎల్ వల్లే సాధ్యమైందని పలువురు అభిప్రాయపడ్డారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ వల్ల భారత క్రికెట్ కు ఎంతో మేలు జరుగుతోందని.. చాలా మంది ప్రతిభ కలిగిన క్రికెటర్లకు ఐపీఎల్ అవకాశం కల్పిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ జట్టులోకి వచ్చిన వెంటనే యువ క్రికెటర్లంతా సత్తా చాటుతున్నారని.. భారత క్రికెట్ జట్టు రిజర్వ్ బలం పెరగడంలో ఐపీఎల్ ముఖ్య పాత్ర పోషిస్తోందని న్నారు.
తాము ఆడే రోజుల్లో వసీమ్ అక్రమ్, షేన్ వార్న్, మెర్వ్ హ్యూస్ వంటి దిగ్గజ బౌలర్ల బౌలింగ్ గురించి తమకు ఏమీ తెలిసేది కాదని అన్నారు. పాకిస్థాన్, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లి నేరుగా వారిని ఎదుర్కొనేవాళ్లమని సచిన్ అన్నారు. ఇప్పుడు పరిస్థితి మారిందని ఐపీఎల్ కారణంగా స్టోక్స్, ఆర్చర్ వంటి బౌలర్లు సూర్యకుమార్ వంటి ఆటగాళ్లకు కొత్తేమీ కాదని చెప్పారు. ఐపీఎల్ లోనే వీరి బౌలింగ్ ను సూర్యకుమార్ ఆడాడని తెలిపారు. ముంబై ఇండియన్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లు ఆడినప్పుడు ఆర్చర్, స్టోక్స్ ఇద్దరి బౌలింగ్‌లో సూర్య ఆడాడు. వాళ్లు ఎలా బౌలింగ్ చేస్తారో అతడికి తెలుసు.
అరంగేట్రానికి ముందే ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అనుభవం ఐపీఎల్ వల్ల వస్తుందని సచిన్ చెప్పారు. ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చిందని అన్నారు. ఇలాంటి యువ ఆటగాళ్ల రాకతో టీమిండియా రిజర్వ్ బలం పెరిగిందని చెప్పారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ ఇషాన్, సూర్యకుమార్ అద్భుతంగా రాణించడంతో.. భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆడిన తొలి మ్యాచులోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు.