రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ పై మాస్టర్ బ్లాస్టర్ కీలక వ్యాఖ్యలు

Sachin Tendulkar Backs Rohit Sharma. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ పై స్పందించారు.

By Medi Samrat  Published on  11 Dec 2020 8:19 AM GMT
రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ పై మాస్టర్ బ్లాస్టర్ కీలక వ్యాఖ్యలు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ పై స్పందించారు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్ళకపోవడంపై సచిన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వంటి నాణ్యమైన ఓపెనర్ ఆడితేనే టీమిండియా టెస్టు జట్టు సమతూకం ఉంటుందని.. రోహిత్ ఫిట్‌నెస్‌గా ఉన్నాడా లేదా అనేది ఒక బీసీసీఐకి, రోహిత్‌కు మాత్రమే తెలుసని సచిన్ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు తప్పకుండా పంపాలని సచిన్ సూచించాడు. రోహిత్‌ ఫిట్‌నెస్‌ స్టాటస్‌ అయితే నాకు తెలీదు. పైగా అది నా వ్యవహారం కూడా కాదు. ఆ విషయం బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుస్తుందని చెప్పాడు సచిన్.

రోహిత్‌ శర్మ వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉంటే మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు తనను పంపడం ఉత్తమం అని సచిన్ పేర్కొన్నాడు. అతని సత్తా ఏమిటో మనకు బాగానే తెలుసునని సచిన్‌ తెలిపాడు.

తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్‌ ఐపీఎల్‌ తర్వాత నేరుగా ముంబైకి వచ్చాడని, ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడని బీసీసీఐ తెలిపింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడెమీలో రోహిత్ ఫిట్ నెస్‌పై శుక్రవారం అంచనా వేయనున్నారు. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్, సెలక్టర్లు కూడా దీనిని పర్యవేక్షిస్తారని సమాచారం. ఫిట్‌నెస్ నిరూపించుకుని రోహిత్ ఆస్ట్రేలియాకు వెళితే నిబంధనల ప్రకారం తాను 14 రోజుల క్వారంటైన్‌ అనంతరమే జట్టుతో కలుస్తాడు.


Next Story