ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు.. రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Ruturaj Gaikwad smashes 7 sixes in an over. విజయ హజారే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
By Medi Samrat Published on 28 Nov 2022 10:16 AM GMT
విజయ హజారే టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. డబుల్ సెంచరీ బాదడమే కాకుండా.. ఒకే ఓవర్ లో 7 సిక్సర్లు కొట్టాడు. ఉత్తరప్రదేశ్ స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్‌లో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ దంచేశాడు. మొదటి 5 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత శివ నో బాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్, ఆ తర్వాతి బంతిని కూడా రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపిచాడు. ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. రుతురాజ్ విధ్వంసంతో ఆ ఓవర్‌లో రికార్డు స్థాయిలో 43 పరుగులు వచ్చాయి. అంతేకాకుండా డబుల్ సెంచరీ చేసి (220) నాటౌట్‌గా నిలిచాడు. మహారాష్ట్ర జట్టు యాభై ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో శివ సింగ్ బౌలింగ్‌లో 43 పరుగులు చేశాడు. 49వ ఓవర్‌లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా ఏడు సిక్సర్లు బాదాడు. ఓవర్‌లోని ఐదవ బంతి నో-బాల్ వేయగా.. ఫ్రీ-హిట్ కూడా సిక్సర్ కొట్టాడు రుతురాజ్ గైక్వాడ్.. ఆ ఓవర్‌లో 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్ లో ఏకంగా 42 పరుగులు కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్(159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో రుతురాజ్ ఏకంగా 16 సిక్స్‌లు బాదాడు. అంకిత్ బావ్నే(37), అజిమ్ కాజీ(37) పరుగులతో సహకారం అందించారు.