కౌంటీల్లో ఆడనున్న రుతురాజ్ గైక్వాడ్.. ఏ జట్టుకంటే.?

భారత బ్యాటర్, CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ కౌంటీల్లో ఆడనున్నాడు.

By Medi Samrat
Published on : 10 Jun 2025 9:15 PM IST

కౌంటీల్లో ఆడనున్న రుతురాజ్ గైక్వాడ్.. ఏ జట్టుకంటే.?

భారత బ్యాటర్, CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ కౌంటీల్లో ఆడనున్నాడు. యార్క్‌షైర్ కు మిగిలిన కౌంటీ సీజన్, వన్డే కప్ కోసం గైక్వాడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. జూలైలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌ లో భాగంగా సర్రేతో జరిగే మ్యాచ్ కోసం రుతురాజ్ యార్క్‌షైర్ జట్టుతో చేరనున్నాడు. సీజన్ ముగిసే వరకు జట్టుతోనే ఉంటాడు.

రుతురాజ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం ఇండియా A జట్టులో భాగంగా ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. రెండు అనధికారిక టెస్ట్‌లలో అతనిని ఉపయోగించలేదు. 28 ఏళ్ల రుతురాజ్ IPL 2025లో CSK తరపున ఆడుతున్నప్పుడు గాయం కారణంగా మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇండియా A జట్టులో ఉన్న గైక్వాడ్, మెట్రో బ్యాంక్ వన్డే కప్‌కు కూడా అందుబాటులో ఉంటాడని కౌంటీ జట్టు నుండి ప్రకటన వచ్చింది.

Next Story