మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధం.. రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు హెడ్ టూ హెడ్ రికార్డ్స్
RR vs RCB Head to Head Records in IPL.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో మరో ఆసక్తిక పోరుకు రంగం
By తోట వంశీ కుమార్ Published on 5 April 2022 9:34 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో మరో ఆసక్తిక పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని వాంఖడే వేదికగా నేడు(మంగళవారం) రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన సంజూ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు అదే ఊపును కొనసాగించాలని బావిస్తోంది. ఇక ఒక మ్యాచ్ గెలిచి, మరొక మ్యాచ్‌లో ఓడిన డుప్లెసిస్ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని పట్టుదలతో ఉంది.
మరీ ఇప్పటి వరకు ఇరు జట్లు ఎన్ని సార్లు తలపడ్డాయి. ఆధిక్యం ఎవరిది అన్న చర్చమొదలైంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 24 సార్లు రెండు జట్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో 12 మ్యాచుల్లో బెంగళూరు, 10 మ్యాచుల్లో రాజస్థాన్ జట్టు గెలుపొందింది. ఓ రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో బెంగళూరు విజయం సాధించడం విశేషం. గత సీజన్(2021) లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ బెంగళూరు జట్టు గెలుపొందడం గమనార్హం.
వాంఖడేలో మైదానంలో జరిగిన గత మూడు మ్యాచుల్లో చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మంచు ప్రభావం అధికంగా ఉండడంతో.. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
తుది జట్ల (అంచనా)
రాజస్థాన్ రాయల్స్ :
జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
ఫాప్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్