14 ఓవర్ల మ్యాచ్.. ఆర్సీబీ బ్యాటింగ్
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంత గడ్డపై బోణీ కొట్టాలని భావిస్తోంది.
By Medi Samrat
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంత గడ్డపై బోణీ కొట్టాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఆటతీరుతో రాణిస్తూ ఉంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకుంది. మ్యాచ్ 9:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ ప్లే 4 ఓవర్లుగా తేల్చారు. ముగ్గురు బౌలర్లు నాలుగు ఓవర్లు, ఓ బౌలర్ మిగతా రెండు ఓవర్లు బౌల్ చేయవచ్చు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (w), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్‌వెల్, ప్రవీణ్ దూబే